గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (19:07 IST)

పుచ్చకాయ, తేనె ఫేస్ ప్యాక్‌ బెనిఫిట్స్ ఏంటి?

పుచ్చకాయలో 95%నీరు కలిగి ఉండటం వల్ల శరీరానికి తేమ అందుతుంది. అందుచేత చర్మం మృదువుగానూ ఆకర్షణీయంగానూ తయారవుతుంది. ఇంకా పుచ్చకాయ ప్యాక్‌తో చర్మానికి కాంతి చేకూరుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
సాధారణంగా అనేక ఫేస్ ప్యాక్‌లలో పుచ్చకాయను ఉపయోగిస్తుంటారు. అనేక సౌందర్య పదార్థలైన పెరుగు, శెనగపిండి, తేనె మరియు పాలు వంటి వాటిలో పుచ్చకాయను చేర్చి హోం మేడ్ ఫేస్ ప్యాక్‌లను తయారుచేసుకోవచ్చు.
 
జ్యూసీగా ఉండే ఈ రెడ్ ఫ్రూట్‌ను నేరుగా ముఖానికి అప్లై చేయొచ్చు. పుచ్చకాయలోని విత్తనాలు తీసేసి, మెత్తగా చేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌గా వేసుకొనే ముందు ముఖాన్ని శుభ్రం కడిగి తర్వాత ఈ వాటర్ మెలోన్ పేస్ట్‌ను అప్లై చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
అలాగే పుచ్చకాయ-తేనె కాంబినేషన్‌తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడటంతో పాటు, కాంతివంతంగా మార్చుతుంది. పుచ్చకాలో గింజలు తీసేసి అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 
 
15 నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్‌ను నేచురల్‌గా తొలిగిస్తుంది. చర్మానికి తగినంత తేమను అందిస్తుంది.