శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2014 (12:23 IST)

గర్భధారణ సమయంలో ఎలాంటి హెల్దీ డ్రింక్స్ తీసుకోవాలి?

మహిళలు గర్భం పొందిన తర్వాత పోషకాహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇది, కడుపులో పెరిగే శిశువుమీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో గర్భిణీ తీసుకొనే సమతుల్యమైన హారంలో అవసరం అయ్యే పూర్తి పోషకాలుండాలి. తల్లి తీసుకొనే పౌష్టికాహారంతోనే కడుపులో పెరిగే శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 
 
పౌష్టికాహారం మాత్రమే కాదు, హెల్దీ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువు ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రెగ్నెన్సీ వల్ల డీహైడ్రేషన్ ముఖ్యంగా మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.
 
గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం ఒక విధంగా మంచిదే. గర్భిణీలు కూడా గ్రీన్ టీ త్రాగడం ఆరోగ్యానికి మంచిదే. ఇది ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 
ఇంకా రోజూ రెండు లేదా మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి. అవకోడా జ్యూస్‌తో పాటు ఆరెంజ్ జ్యూస్‌ను తీసుకోవాలి. చెర్రీ జ్యూస్, జింజర్ టీ వంటివి తీసుకోవాలి.