గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (17:41 IST)

డార్క్ చాకెట్లతో గర్భిణీ మహిళ గుండె పదిలం!

డార్క్ చాక్లెట్ తీసుకుంటే గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందని గైనకాలజిస్టులు అంటున్నారు. డార్క్ చాక్లెట్‌ను కోకోతో తయారుచేస్తారు. ఇందులో థియోబ్రొమైన్ కలిగి ఉండి ఇది రక్తప్రసరణను పెంచుతుంది. 
 
ఈ థియోబ్రోమైన్ కడుపులో పెరిగే శిశువుకు కూడా అవసరం అయ్యే రక్తప్రసరణను అందిస్తుంది. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతాయి. అలాగే కడుపులో పెరిగే శిశువు కూడా హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి రక్షింపబడుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. 
 
ఇంకా డార్క్ చాక్లెట్‌లో ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండి, గర్భిణీలో ఇది హీమోగ్లోబిన్ కౌంట్‌ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల గర్భిణీ స్త్రీ గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఎలాంటీ గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఎదుర్కొంటుంది. కాబట్టి, గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలెన్నో పొందవచ్చునని గైనకాలజిస్టులు అంటున్నారు.