బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 మార్చి 2015 (15:44 IST)

మహిళలకు కొన్ని సూచనలు: అవతలి వారు నొచ్చుకోకుండా మాట్లాడాలి!

* దృఢంగా వుండాలి-ఆత్మరక్షణలో లేదా వేడుకున్నట్లు వుండరాదు. ఐతే మర్యాద పూర్వకంగా వుండాలి. 
* ఆలోచించి చెపుతానంటే అది నిజంగా వాగ్ధానం చేసినట్టు కాదు. మీరో ఏదోలాగా చేస్తారులే అని అవతలి వారు భావిస్తూ వుంటే మాత్రం వారు అసంతృప్తి చెందవచ్చు. ఎందుకు చేయలేకపోయారని వివరణ కోరితే.. నాకు ఉన్న పనులతో కుదరలేదని దృఢంగా చెపితే అంగీకరించేలా వుంటుంది. 
 
*  రోజులో ఎంతో సమయం ఉన్నప్పటికీ, ఇతరుల పనులు చేయడానికి కూడా ఒక పరిమితి వుంటుందని గుర్తించండి. కాదని ఎలా చెప్పాలి. ఇతరులు అడిగేవి అన్నీ స్వార్థంతోనని భావించకుండా అవతలి వారు నొచ్చుకోకుండా ముందు మాట్లాడాలి. విశ్రాంతి సమయం ఇతరులవలె మీకూ ముఖ్యమే. 
 
*  తప్పు అర్థం తీసుకున్నట్లయితే ''కాదు'' అని దృఢంగా చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా డబ్బు అడిగితే, వారు తిరిగి ఇవ్వరని భావిస్తే, నాకూ ఇవ్వాలనే వుంది. కానీ స్నేహితులకు డబ్బు ఇవ్వరాదనేది నా సూత్రం అని చెప్పాలి. తిరిగి రాని బకాయిల వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. సమస్య పరిష్కారానికి సూచనలు, ప్రత్యామ్నాయాలు చెప్పవచ్చు. 
 
* తమ బదులు రాత్రి డ్యూటీలు చేసిపెట్టమని అడిగితే ఆ వారం నాకు వీలుకాదని నిశ్చయంగా చెప్పాలి. మీ పరిస్థితిని అర్థం చేసుకోకపోతే ఇప్పటికే చెప్పాను కదా అని వాస్తవం చెప్పాలి. అయితే మన్నింపులు లాంటివి చెప్పరాదు. లేదా ఆ పని నాకు వీలుకావడం లేదని వివరించడం బాగుంటుంది. ఇరుగు పొరుగువారు ఏదైనా పని అడిగినా అంత సమయం నాకు వుండదని మర్యాదపూర్వకంగా చెప్పవచ్చు.