శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (18:55 IST)

మధుమేహాన్ని బీట్ చేయాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోండి!

మధుమేహాన్ని బీట్ చేయాలంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ గల ఆహారాన్ని తీసుకోవాలి. ఒమెగా త్రీ ఫ్యాటీ ఫుడ్స్‌లో సాల్మన్ ఫిష్ ఎంతగానో పనికొస్తుంది. చేపలు, సార్డిన్లు, మార్కెల్ మొదలైన వాటిలో వీటిని పొందవచ్చు. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి. 
 
మధుమేహంను ఓడించటానికి ఉత్తమ మార్గాలలో ఒకటి "ఆకుపచ్చని కూరలు" తీసుకోవడం. ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా చేర్చుకోవడం ద్వారా డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చు. అవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి ఉపయోగపడతాయి. డయాబెటిస్ వలన వచ్చే దృష్టి సమస్యలు తగ్గటానికి ఆకుపచ్చని కూరలలో సమృద్ధిగా ఉండే విటమిన్ బి, సి సహాయం చేస్తాయి.
 
ఇక వోట్ మీల్ ఆహారాన్ని కూడా డయాబెటిస్ కంట్రోల్‌కు ఉపయోగించవచ్చు. వోట్ మీల్ అల్పాహారం మధుమేహంను ఓడించటానికి మెరుగ్గా సహాయం చేస్తుంది. వోట్ మీల్‌లో ఫైబర్ ఉండుటవలన రక్తంలో పిండి పదార్థాలు చక్కెరగా మారటానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇకనుంచి ప్రతి ఉదయం వోట్ మీల్‌ను అల్పాహారంగా తీసుకోవటానికి ప్రయత్నించండని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.