Widgets Magazine

భార్య అంటే అంత చులకనా...? భర్తను ఎందుకలా తిడుతారు...?

సోమవారం, 5 జూన్ 2017 (21:09 IST)

Widgets Magazine
couple divorce

సమాజంలో వివాహ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. భార్యభర్తల మధ్య పాగా వేస్తున్న మనస్పర్ధలు విడుకాలకు దారితీస్తున్నాయి. తద్వారా వివాహాలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. అయితే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనస్పర్ధలు పెద్ద సమస్యలు కాబోవు. భర్త ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్యను ప్రేమతో పలకరించడం అలవాటుగా పెట్టుకోవాలి. 
 
ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు కంప్యూటర్ ముందుకు కూర్చోవడం, టీవీకి అతుక్కుపోవడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా భోజనం చేసే సమయంలోనూ, బెడ్ రూమ్‌లోనూ సెల్‌ఫోన్ వాడకపోవడం మంచిది. భార్యాభర్తల మధ్య ఏదయినా సమస్య వచ్చినప్పుడు వాదించుకోవడం వల్ల అది పెరుగుతుందే తప్ప తగ్గదు. అటువంటి సమయంలో ఇద్దరూ పోట్లాడడం మాని, అసలు సమస్య తీరే మార్గం కోసం అన్వేషించాలి.
 
ఉద్యోగాలు చేస్తూ, ఎన్నిపనులున్నా సరే ఇద్దరూ కలిసి ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాలి. ఆర్ధికపరమైన ఇబ్బందులు, పనుల ఒత్తిళ్లు ఎన్నున్నా ఇద్దరూ శృంగారానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇద్దరి మధ్యా స్పష్టమైన భావవ్యక్తీకరణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 
భాగస్వామిలో ఏదైనా ప్రత్యేకతను గమనించినట్లైతే దాన్ని ప్రశంసించేందుకు ఎప్పుడూ వెనకాడకండి. ఎదుటివాళ్లలో వచ్చిన ఏ మంచి మార్పు అయినా సరే గుర్తించాలి, అభినందించాలి. మీ భాగస్వామిని ఎవరికైనా పరిచయం చేస్తున్నప్పుడు కేవలం పేరూ, ఉద్యోగం కాకుండా ప్రత్యేకతలుంటే వాటిని కూడా చెప్పాలి. తద్వారా ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో తరచు నవ్వు తెప్పించే వీడియోలు, టీవీ ప్రోగ్రామ్‌లు చూడటం, పుస్తకాలు చదవడానికి చేయండి. ఇలా ఇద్దరూ కలిసి నవ్వడం వలన భార్యాభర్తలు ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

సౌందర్య చిట్కాలు.. నల్ల ద్రాక్ష, క్యారెట్‌తో ఫేషియల్ ఎలా?

నల్ల ద్రాక్ష గుజ్జుకు అర చెంచా తేనె, అర చెంచా నిమ్మరసం కలపాలి. దీనికి గంధం అర చెంచా, ...

news

మొటిమలు ఉన్నాయా.. పోగొట్టడం చాలా ఈజీ....

మొటిమలు.. టీనేజ్ వయస్సులో యువతీయువకులను చాలా ఇబ్బంది పెట్టే సమస్య. శ్వేద గ్రంథులకు ...

news

శిరోజాలు అందంగా ఉండాలంటే.. రోజూ తలస్నానం చేయకూడదట..

శిరోజాలు అందంగా ఉండాలంటే.. రోజూ తలస్నానం చేయకూడదు. రెండు, మూడు రోజులకొకసారి చేస్తే ...

news

ఎండుద్రాక్షని నీటిలో వేడిచేసి తాగితే.. నెలసరి కడుపునొప్పి?

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని ...