శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 6 మే 2017 (18:40 IST)

కుర్చీకే అతుక్కుపోతే.. ఒత్తిడి తప్పదు.. కాస్త లేవండి.. నాలుగడుగులు వేయండి..

గంటలు గంటలు కుర్చీలకు అతుక్కుపోతున్నారా? ఐతే ఒత్తిడి తప్పదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఎడతెగని ఆలోచనలు.. ఒత్తిడికి కారణం గంటల పాటు కుర్చీకే పరిమితం కావడమని వారు చెప్తున్నారు. ఒత్తిడిని అధిగమించాలం

గంటలు గంటలు కుర్చీలకు అతుక్కుపోతున్నారా? ఐతే ఒత్తిడి తప్పదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఎడతెగని ఆలోచనలు.. ఒత్తిడికి కారణం గంటల పాటు కుర్చీకే పరిమితం కావడమని వారు చెప్తున్నారు. ఒత్తిడిని అధిగమించాలంటే.. ఒకే చోటున కూర్చోకూడదు. ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ.. ఒత్తిడికి గురిచేస్తుంటే.. టక్కున సీటు నుంచే లేవాలి. నాలుగు అడుగులు వేయాలి. 
 
కుదరకపోతే మెట్లు ఎక్కి దిగాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ జరిగి ఒత్తిడి అదుపులోకి వస్తుంది. ఇలా చేయడం ద్వారా మెదడు పనితీరు మెరుగవుతుంది. రక్తప్రసరణ సక్రమంగా వుంటుంది. తద్వారా చురుగ్గా పనిచేయగలరు. ఒత్తిడి వేధిస్తుంటే పచ్చని చెట్లను చూడండి. ప్రకృతిని ఆస్వాదించండి అంటున్నారు.. మానసిక వైద్య నిపుణులు. 
 
మనసంతా గజిబిజీగా ఉన్నప్పుడు మనసు తేలిక పడాలంటే మరో ప్రత్యామ్నాయం చక్కటి సంగీతం వినడం చేయాలి. పనిలో ఉన్నా సరే.. కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు మంద్రస్థాయిలో సంగీతాన్ని వింటే మెదడుకు హాయిగా ఉంటుంది. ఒత్తిడిని జయించాలంటే.. టైమ్ టేబుల్ ప్రకారం పనులు చేయడం మంచిది. అదీ మీ సామర్థ్యానికి అనుకూలంగా వుండాలి. ఒత్తిడిని చూసి జడుసుకోకండి.. దాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తే.. మానసిక ఆందోళనలు లేని జీవితం మీ సొంతం అవుతుంది.