శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 18 జులై 2014 (18:16 IST)

మనిషిపై ప్రభావం చూపే పూల రంగు.. సువాసన...!

పూలు కళ్లకు అందంగా కనిపిస్తాయి. పూలను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత కలుగుతుంది. ఒక్కొక్క పూవుది ఒక్కో సువాసన. పూల రంగు, సువాసనల ప్రభావం మనిషి మీద ఉంటుంది. ఈ పూల రేకులలో, మొక్కలలోని హార్మోన్లు ఉంటాయి. ఇవి మనిషికి మేలు చేసేవి. అందుకే ఔషధాల తయారీలో పూలను వాడుతారు. 
 
గులాబీపూలు మనిషి మూడ్‌ను మారుస్తాయి. ఎంతో విచారంలో ఉన్న వారికి గులాబీలు అందించినట్లయితే వారి మనసులో ఆనందం మొదలవుతుంది. గులాబీల నుండి తీసిన రసాయనాలు మానవ కాలేయం, పిత్తాశయాల పనితీరును మెరుగుపరుస్తాయి. 
 
మేరీగోల్డ్ పూలు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తాయి. గాయాలకు రాసే ఆయింట్‌మెంట్లలో ఈ పూలు ఉపయోగిస్తారు. చమేలీ పుష్పాలు పేగు పనితీరును ఎంతగానో మెరుగుపరుస్తాయి. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కడుపునొప్పి, నోటిలో నంజు పొక్కు నుండి ఉపశమనం కలిగిస్తుంది. డాంజిలియన్ పూలు రక్తలేమి, కామెర్ల చికిత్సలో వాడుతున్నారు.