బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (12:33 IST)

గర్భవతుల ఆరోగ్యానికి పండ్లు ఎంతో శ్రేష్టకరం

పండంటి బిడ్డ పుట్టాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అయితే గర్భంతో ఉన్న మహిళ తినే ఆహారంపై బిడ్డ రూపం, బరువు ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలీదు. గర్భంతో ఉన్న మహిళలు ఆహార నియమాలు తప్పక పాటించాలి. గర్భం దాల్చిన రోజు నుంచి తీసుకునే జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్కువగా పండ్ల రసాలను తీసుకోవాలని వైద్యులు పదేపదే చెపుతుంటారు. అందుకని మూడో నెల దాటే వరకూ పండ్లరసాల కంటే పండ్లు ఆరగించడం ఎంతో మంచిది. 
 
గర్భవతులుగా ఉన్న సమయంలో తీసుకున్న ఆహారమే కారణమని, ముఖ్యంగా పండ్లు ఎక్కువగా తినడం కుందనపు బొమ్మలాంటి పిల్లల్ని కనవచ్చనే విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా చేసిన ఒక సర్వేలో తేటతెల్లమైంది. ఈ సర్వే కోసం 688 మంది వద్ద వివరాలు సేకరించారు. 
 
తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు వారు పాటించిన ఆహార నియమాలను అడిగి తెలుసుకున్నారు. వీరిలో అధిక శాతం తల్లులు తమ ఆహారంలో పండ్లు ఎక్కువగా తీసుకున్నట్లు ఆ సర్వే ద్వారా తెలిసింది. గర్భవతులుగా ఉన్న సమయంలో పండ్లు తీసుకోవడమనేది పుట్టబోయే బిడ్డ తెలివితేటలపై కూడా ప్రభావం చూపుతుందని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా చేసిన ఒక సర్వేలో తేలింది.