మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (13:47 IST)

కేశరక్షణకు ఇలా చేయాల్సిసిందే..?

చాలా మంది తమ శరీరంపై చూపించే శ్రద్ద కురులపై చూపించన్నంటున్నారు. అసలు దాని గురించే పట్టించుకోరు. జుట్టును అందంగా ఉంచుకోవాలని అనుకుంటారు. అలా అనుకూనే వారు బహు అరుదుగా కనపడుతుంటారు. నేటి తరుణంలో కురులను నిర్లక్ష్యం చేసేవారే అధికంగా ఉన్నారు. దానికి కారణం పని ఒత్తిడి అని చెప్తున్నారు. 
 
కురుల కోసం ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ లేదు. పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటే ముఖంలో కాంతి, కేశాలలో మెరుపు తగ్గే అవకాశముంది. విటమిన్స్‌ కూడా ఆరోగ్యవంతమైన కేశాలకు అవసరం. పాలు, పన్నీర్‌, మాంసం, చేపలు, వెన్న, గుడ్లు, క్యారెట్‌, టమాటా, ఆకుపచ్చని కూరలు, అరటి, నిమ్మ, నారింజ, లాంటి వాటిలో కురులకు అవసరమయ్యే పోషకపదార్థాలు లభిస్తాయంటున్నారు వైద్యులు.
 
ప్రస్తుతం షాంపూలు అందుబాటులోకి వచ్చాక తలస్నానం చాలా తేలికైంది. కాబట్టి కొంతలో కొంత నయం. లేకుంటే తలకు నూనె మర్దన చేసుకుని, కుంకుడు కాయల రసంతో తీరికగా తలంటి పోసుకోడమంటే ఈ రోజుల్లో మహిళలకు కష్టమే. శరీర పుష్టి కోసం పౌష్టికాహారాన్ని ఎలా తీసుకుంటారో, కేశ సంపద ఆరోగ్యంగా ఉండేందుకు కూడా అలాంటి పోషక విలువలున్న ఆహారాన్నే తీసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.