శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 మే 2017 (11:54 IST)

బాలింతకు మేలు చేసే మునగ.. ఎలా?

మునగలో మరిన్ని పోషకాలున్నాయి. మహిళలు గర్భం దాల్చినప్పుడు మునగను తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మునగను తీసుకోవడం ద్వారా ప్రసవానికి ముందు.. తర్వాత వచ్చే సమస్యలు దరిచేరవు. పాలు బాగా

మునగలో మరిన్ని పోషకాలున్నాయి. మహిళలు గర్భం దాల్చినప్పుడు మునగను తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మునగను తీసుకోవడం ద్వారా ప్రసవానికి ముందు.. తర్వాత వచ్చే సమస్యలు దరిచేరవు. పాలు బాగా పడతాయి. దీని ఆకులు, పూలకు యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలున్నాయి.

వీటిని ఆహారంగా తీసుకుంటే విటమిన్‌ సి అధికమోతాదులో శరీరానికి అందుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు దరిచేరవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు అదుపులో ఉంటాయి. 
 
క్యాల్షియం, ఐరన్, ఇతర విటమిన్‌లు ఎముకలు బలంగా మారేందుకు తోడ్పడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా పిల్లల్లో ఎముక సాంద్రత పెరుగుతుంది. మునగాకు, కాయలు రక్త శుద్ధికి తోడ్పడే గుణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా మధుమేహ బాధితులు మునగ ఆకులకు ఆహారంలో ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.