గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (16:58 IST)

మొటిమలు తగ్గాలంటే.. బొప్పాయి గుజ్జులో?

మొటిమలు తగ్గాలంటే.. బొప్పాయి గుజ్జులో, చెంచా పాలు, చెంచా తేనె, తగినంత తులసిపొడి వేసి మెత్తగా కలుపుకోవాలి. దాన్ని ముఖానికి రోజూ ఉదయాన్నే ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మొటిమల సమస్య అదుపులో ఉంటుంది. 
 
గంధాన్ని అరగదీసి దానికి చెంచా గులాబీ రేకుల పొడి, చెంచా పచ్చిపాలు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలాచేస్తే మొటిమలు తగ్గడంతో పాటు చర్మం రంగూ మెరుగపడుతుంది.
 
అలాగే టేబుల్ స్పూన్ పాలు, చెంచా పసుపు, చెంచా సెనగపిండి కలుపుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకుని ఉదయాన్నే రాసుకోవాలి. లేదంటే బంగాళాదుంపను పేస్ట్ చేసుకోవాలి. దానికి చెంచా పాలు జత వేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇది కళ్లకింద ఉండే నల్లటి వలయాల్ని ముఖంపై మొటిమల్ని వాటి తాలుకూ మచ్చల్ని తగ్గిస్తుంది.