శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 మార్చి 2015 (18:22 IST)

మహిళల్లో డి విటమిన్ తగ్గితే.. డిప్రెషన్ ఎక్కువే!

ఎండల్లో తిరగని మహిళల్లో నిరాశ, నిస్పృహలు ఎక్కువేనని తాజాగా అమెరికా అధ్యయనంలో తేలింది. శరీరంలో తగినంత డి విటమిన్ లేని మహిళలు ఇతరులతో పోలిస్తే అధికంగా నిరాశ, నిస్పృహలను కలిగివుంటారని తాజా అధ్యయనం తేల్చింది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలూ లేకున్నా డీ విటమిన్ తగ్గితే మహిళల్లో డిప్రెషన్ పెరుగుతుందని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ తాజా అధ్యయనం తెలిపింది. 
 
డీ విటమిన్ లోపంతో ఉన్నవారికి మిగతావారితో పోలిస్తే త్వరగా నిరాశ ఆవహిస్తుందని వివరించింది. ఈ రీసెర్చ్ కోసం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న 185 మంది కాలేజీ విద్యార్థినులను భాగం చేశామని వివరించారు. వారి రక్తంలోని డీ విటమిన్ పరిమాణాన్ని, డిప్రెషన్ ను 5 వారాల పాటు పరిశీలించామని తెలిపారు. కాగా, డీ విటమిన్ సూర్యరశ్మి నుంచి శరీరానికి లభిస్తుందన్న సంగతి తెలిసిందే.
 
రకరకాల కారణాలతో డిప్రెషన్ వస్తుందని, వాటిల్లో డీ విటమిన్ లోపం ఒకటని అధ్యయన రచయిత డేవిడ్ కెర్ చెప్పారు. ఎముకల ఆరోగ్యానికి, కండరాల మెరుగైన పనితీరుకు డీ విటమిన్ తప్పనిసరి అని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిరాశా, నిస్పృహల స్థాయి మారుతోందని తెలిపారు.