గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (15:29 IST)

ఖర్చు తగ్గించుకోవాలంటే.. ఫోనూ.. నెట్టూ.. కట్ చేయాల్సిందే!

ప్రతి నెలా ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటాం. కానీ ఏవో అనుకోని ఖర్చులు వచ్చి పడుతుంటాయి. అలా కాకుండా ఖర్చులు తగ్గించుకుని పొదుపుని పక్కగా అమలు చేయాలంటే.. పొదుపు చేయడమంటే ప్రతి విషయాన్నీ అతిగా ఆలోచించి ఖర్చులప కోత విధించడం కాదు.

కొంతమంది ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అతిగా ఖర్చు పెడతారు. ఆ ఖర్చు అవసరానికి మించి ఉంటుంది. ఇంకొందరు దుస్తుల కోసం వెచ్చిస్తారు. నెలవారీ ఖర్చుల జాబితా తయారు చేయండి. అందులో ముందు వరుసలో ఏ మూడు అంశాలు ఉన్నాయో వాటిపై దృష్టి పెట్టండి. అవసరానికి మించి వాటిపై ఖర్చు చేస్తున్నాం అనిపిస్తే వెంటనే తగ్గించండి.
 
నెలవారీ సరకులు కొనడానికి సూపర్ మార్కెట్‌కి వెళ్లడానికి ముందే ఒక జాబితా తయారుచేసుకోవాలి. వాటికెంత ఖర్చవుతుందో మనసులో ఓ లెక్కసుకోవాలి. ఇలా చేయడం వల్ల కనిపించినవన్నీ కొనేయకుండా.. అవసరమైన వాటినే మొదట కొంటాం. ఇవేకాదు.. కొన్ని అలవాట్లను మార్చుకున్నా కొంత ఆదా చేయగలరు. 
 
అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు తిరగకుండా చూసుకోవాలి. అనవసరంగా ఫోనులో మాటల మారథాన్ కొనసాగించడం.. నెట్‌ని అలా చూస్తూ ఉండటం తగ్గించుకుంటే మంచిది.