గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2016 (10:18 IST)

బహిష్ఠు సమయంలో కడుపు నొప్పి... ఏం చేయాలి?

మెన్సెస్‌ సమయంలో కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం తీసుకునే ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుంటే నొప్పినుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు చూద్దాం!
 
మెన్సెస్ వచ్చినప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, తీపి పదార్థాలు, మసాలా దినుసులను తగ్గించి తీసుకోవాలి.
 
ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా తగిన మోతాదులో తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో టీ, కాఫీ, కోక్, చాకొలేట్, చల్లటి పానీయాలు తీసుకోకూడదు. వీటికి బదులుగా నిమ్మరసం, హెర్బల్ టీ తీసుంటే ఉపశమనం కలుగుతుంది.భోజనం ముగించిన తర్వాత విటమిన్ బీ, క్యాల్షియంకు చెందిన మాత్రలు వాడడం మంచిది. ఇవి నొప్పిని నివారించడానికి ఉపయోగపడుతాయి. 

ఆహారంలో చేపలు, చికెన్, కూరగాయలు మరియు పండ్లు ఉండేలా చూసుకోవాలి. వెచ్చటి నీటితో స్నానం చేయాలి.