గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (16:56 IST)

మహిళలు లావుగా ఉంటే శాలరీ డౌన్.. ప్రమోషన్స్ కట్!

మహిళలు లావుగా ఉంటే ఆరోగ్యానికి చేటే కాదు.. వారు కెరీర్‌కు కూడా చేటేనని తాజా అధ్యయనం తేల్చింది. అమెరికాలో లావుగా ఉండే మహిళలకు ఉద్యోగాలిచ్చేందుకు సంస్థలు ముందుకు రావట్లేదు.
 
అలాగే ఇప్పటికే కొన్ని సంస్థల్లో పనిచేసే లావాటి మహిళలకు 2011 జీతంతోనే పనిచేస్తున్నారని.. వారికి జీతం పెంచడానికి కూడా నిర్లక్ష్యం చూపుతున్నారని.. అదేవిధంగా బరువు ఎక్కువగా ఉన్నవారికి.. సాధారణంగా ఉండే వారికంటే జీతాలు తక్కువని తేలింది.
 
అంతేకాదు.. వీరికి పదోన్నతుల్లోనూ సరైన ప్రోత్సాహం ఉండటం లేదు. మరి మగవాళ్లు బరువు ఎక్కువగా ఉంటే వారి పరిస్థితి గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదని, ఈ వివక్ష మగవారి విషయానికొచ్చే సరికి 5 శాతమేనని తేలింది.