గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (16:32 IST)

అమ్మాయిలు లావైతే.. ఇబ్బందులు తప్పవ్!

లావుగా ఉండే అమ్మాయిలకు పలురకాల ఇబ్బందులున్నాయి. ఒకటి.. పదిమందిలో కలిగే ఇబ్బంది. తనను తాను రూపంపరంగా సమర్థించుకోలేక, ఇతరులు స్నేహానికి ముందుకురాకపోవడంతో ఒంటరివారవుతారు. మిగిలిన అమ్మాయిలలాగా బాయ్ ఫ్రెండ్స్ లేరని వేధిస్తుంది. 
 
ఇది సామాజికపరమైన ఇబ్బందయితే, అనారోగ్యపరమైన ఇబ్బందులు ఇంకా ఉన్నాయి. లావుగా ఉన్న అమ్మాయిలకు షుగర్ జబ్బు వచ్చే ప్రమాదం అధికం. అదేవిధంగా రక్తప్రవాహ సమస్యలు, గుండె జబ్బుల సమస్యలు వెంటాడుతాయి. 
 
వివాహం తర్వాత గర్భం ధరించటానికి ఒకటి రెండు సార్లు మరీ ఆలోచించాల్సి ఉంటుంది. కాని లావుగా ఉండే తల్లులు తన కడుపులో బిడ్డకు ఫోలిక్ ఆమ్లం అందివ్వలేని పరిస్థితి ఎదురవుతుంది. పోషకాహారం, వ్యాయామం మీద శ్రద్ధ పెట్టని అమ్మాయిల జీవితం ఇబ్బందికరమని న్యూట్రీషన్లు అంటున్నారు.