గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (13:17 IST)

బొప్పాయి ఆకులను చింతపండు, ఉప్పుతో మహిళలు తీసుకుంటే?

పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలోనే పోషకాలుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బొప్పాయిలోని పోషకాలు, ఎంజైములు జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చుతాయి. 
 
ప్రతి 100 గ్రాముల పచ్చి బొప్పాయిలో 39 కెలోరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని తినడం ద్వారా కొవ్వు చేరే అవకాశమే లేదు. రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్టు చూడడం ద్వారా రక్తపోటు స్థాయిని బొప్పాయి.. సరైన స్థితిలో ఉంచుతుంది. 
 
పచ్చి బొప్పాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ ఉంటాయి. దీన్ని సలాడ్ల రూపంలోనూ, జ్యూస్ గానూ తీసుకోవచ్చు. ఇక, బొప్పాయి ఆకులను చింతపండు, ఉప్పుతో కలిపి తీసుకుంటే మహిళల్లో బహిష్టు కారక నొప్పులు తగ్గుముఖం పడతాయి.
 
సౌందర్యంలోనూ బొప్పాయి సూపర్‌గా పనిచేస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు, పలు రకాల చర్మ వ్యాధులను నయం చేసే శక్తి పచ్చి బొప్పాయికి ఉంది. పచ్చి బొప్పాయితో అమీబియాసిస్, నులిపురుగుల బెడద తప్పుతుంది. తద్వారా, అజీర్ణం, పుల్లని తేన్పులు వంటి బాధలు నెమ్మదిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.