శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 జూన్ 2015 (17:56 IST)

ఆరోగ్యానికి పరుగుతో మేలెంతో తెలుసుకోండి

ఆరోగ్యానికి వ్యాయామం మంచిదే. అందుకే చాలామంది ఉదయమో, సాయంత్రమో నడవడం అలవాటు చేసుకున్నారు. అయితే దైనందని వ్యాయామంతో పాటు వారానికి ఐదురోజులపాటు రోజుకి ఐదు నిమిషాల చొప్పున పరిగెత్తితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు, బీపీ, పక్షవాతం, క్యాన్సర్.. వంటి వ్యాధులను నియంత్రించుకోవచ్చు. 
 
* పరుగు వల్ల ఎండొకెనాబినాయిడ్లు అనే హార్మోన్లు విడుదలవడంతో ఆనందం లభిస్తుందని పరిశోధనలో తేలింది. పరిగెత్తితే మోకాళ్ల పనితీరు మరింత మెరుగవుతుంది. ఆస్టియో ఆర్థ్రైటిస్ ‌ను తగ్గించుకోవచ్చు. రోజూ ఐదు నిమిషాలు పరిగెత్తడం వల్ల జీవితకాలం కనీసం ఓ ఐదేళ్లు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.