శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2014 (17:10 IST)

మహిళలూ... బిడియం ఉంటే అల్జీమర్స్ తప్పదట..!

అవునండి. బిడియానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారే మహిళలకు మతిమరుపు తప్పదని స్వీడెన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఉండే మహిళల కంటే బిడియం ఎక్కువగా ఉన్న మహిళల్లో అల్జీమర్స్ ప్రభావం అంతే ఎక్కువుందని స్వీడెన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.  
 
స్వీడన్ లోని గొతెన్ బర్గ్ వర్సిటీకి చెందిన లెనా జాన్సన్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. సుదీర్ఘకాలం ఒత్తిడికి గురయ్యే మహిళలతో పాటు బిడియం పాళ్లు ఎక్కువగా ఉండే మహిళలు అల్జీమర్స్ బారిన పడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని ఆయన వెల్లడించారు
 
సాధారణ స్థాయి బిడియం ఉండే మహిళల కంటే సదరు లక్షణం పాళ్లు కాస్త ఎక్కువగా ఉండే మహిళలు, సున్నిత మనస్కుల విషయంలో ఈ ముప్పు మరింత ఎక్కువని తేలింది. 
 
ఇక నిత్యం ఆందోళనకు గురవుతున్న మహిళలూ ఈ వ్యాధి బారిన పడటం ఖాయమని కూడా వారు పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు.