గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2014 (16:22 IST)

షాపింగ్‌కు వెళ్తున్నారా? క్రెడిట్ కార్డు ఇంట్లోనే పెట్టేయండి.!

డబ్బును వృదా చేయడంలో క్రెడిట్ కార్డు పాత్ర చాలా ఉంది. జేబులో నుండి డబ్బుతీసి ఇవ్వటానికి చాలా మంది బాధపడి, వస్తువులు బేరం చేసిన తర్వాత కూడా వాటిని కొనటం ఆపేస్తుంటారు. కానీ క్రెడిట్ కార్డు వాడకంలో జబ్బులు చేతులు మారుతుందన్న బాధ మనసును ఆ క్షణంలో సోకదు. ఆ తర్వాత మనం చెల్లించాల్సిందే. 
 
అయినా అప్పటికప్పుడే చెల్లించనవసరం లేని సౌకర్యం క్రెడిట్ కార్డు ఇస్తుంది. కాబట్టి కార్డ్ వాడకం ద్వారా అనవసరపు కొనుగోళ్ళు విపరీతంగా చేస్తుంటారు. జేబులో డబ్బుంటే కొనుగోలు పరిమితి తెలుస్తుంది. క్రెడిట్ కార్డులో ఆ పరిమితి తెలియదు. 
 
కాబట్టి మీ డబ్బు ఆదా అవ్వాలంటే క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బాగా తగ్గించండి. వారాంతపు షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు క్రెడిట్ కార్డ్‌ని ఇంట్లోనే పెట్టి వెళ్ళాలి. ముఖ్యంగా యువతలో దుబారా పెంచినది క్రెడిట్ కార్డే. అందుచేత క్రెడిట్ కార్డుల వాడకం పరిమితంగా ఉండాలి. అలాగే క్రెడిట్ కార్డుల బిల్లులు, వాటిపై వడ్డీల కథంతా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే ఖర్చులు తగ్గుతాయి.