గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By PNR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (13:42 IST)

బిగుతైన వక్ష సంపదకోసం కొన్ని చిట్కాలు!

టీనేజ్‌లో చాలామంది అమ్మాయిలు తమ వక్ష సంపద గురించి బెంగ పడుతుంటారు. వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయని కొందరు బాధపడితే, వక్షోజాలు కిందికి జారి ఉన్నాయని మరికొందరు బాధపడుతుంటారు. దీనిని ఎలాగైనా అధిగమించేందుకు రకరకాల క్రీములను, ఇంకా ఏవేవో పద్ధతులను పాటిస్తారు. కానీ తమకు తామే వక్ష సంపదను పెంచునే మార్గం, తీర్చిదిద్దుకునే మార్గాలు ఉన్నాయంటున్నారు బ్యూటిషియన్లు. ఈ చిట్కాలను పాటిస్తే తీరైన వక్ష సంపద ఒనగూరుతుందంటున్నారు. 
 
మొదటిది... ముందుగా మీరు నిటారుగా నిలబడండి. ఆ తర్వాత మెడను పైకెత్తి భుజాలను వెనక్కి లాగుతున్నట్లుగా ఉంచి వక్ష సంపదను ముందుకు వచ్చే విధంగా గాలి పీల్చి వదులుతుండాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే వక్షోజాల ఆకృతిలో తేడా గమనించవచ్చు.
 
ఇక బ్రాలను కొనుగోలు చేసేటపుడు అవి ఎటువంటివో చెక్ చేసుకుని తీసుకోవాలి. తీరైన స్తనాకృతిని పొందేందుకు పుష్- అప్ బ్రాలు ఎంతో ఉపయోగపడుతాయి. ప్యాడెడ్ బ్రాలు కూడా ధరించవచ్చు. అయితే వీటిని ధరించేటపుడు వక్షోజాలు ప్యాడ్ల మధ్యనే ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి.
 
బ్రా ధరించిన తర్వాత బ్రా స్ట్రాప్స్‌ను చాలామంది వదిలేస్తుంటారు. ఇలా వదిలేయడం వల్ల వక్షోజ ఆకృతుల్లో తేడాలు వస్తాయి. కనుక బ్రా వేసుకున్న తర్వాత స్ట్రాప్స్‌ను బిగుతు చేయడం మరువవద్దు. ఇక ఈ స్ట్రాప్స్ కూడా వక్షోజాలను పైకేత్తి ఉంచేవిగా ఉండాలి. అంతేతప్ప ప్రక్కకు లాగిపట్టి ఉంచేటటువంటి క్రాస్‌గా ఉన్న స్ట్రాప్స్‌తో కూడిన బ్రాలను ధరించకపోవడమే మంచిది.
 
మీరు వేసుకునే టాప్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి
నెక్ లైన్ కిందికి లాగుతున్నట్లుగా ఉండకూడదు. మెడ దగ్గర లేస్ ఉన్నటువంటి టాప్‌ను ఎంచుకోండి. దానిద్వారా మీరు వేసుకున్న టాప్‌ను మెడ వెనుకకు గట్టిగా లాగి కట్టడం ద్వారా వక్షోజాలను లిఫ్ట్ చేసినట్లవుతుంది. ఫలితంగా వక్షోజాలు కిందికి జారినట్లు కనిపించవు.
 
వి- నెక్‌తో కూడిన బ్లౌజ్‌లు ధరించవచ్చు. కొంతమంది జేబులున్నటివంటి టాప్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. ఇటువంటివి ధరించి జేబుల్లో తరచూ చేతులు పెడుతూ కిందికి నెట్టడం వల్ల కూడా వక్షోజాలు జారినట్లు అవుతాయి. కనుక జేబులు లేని టాప్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఈత కొలనుల్లో ఈతకొట్టేందుకు బికినీలు ధరించేటపుడు కూడా త్రికోణాకృతిగా ఉన్నటువంటి స్విమ్ సూట్ వేసుకోవడం మంచిది. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. మహిళల వక్ష సంపద ఎల్లవేళలా బిగుతుగా ఉంటుంది.