గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2014 (18:31 IST)

గర్భిణీలు రాత్రి పడుకొనే ముందు వ్యాయామం చేస్తే.. ?

గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం మంచిదే కానీ బెడ్ టైమ్‌లో వ్యాయామం చేయడం మంచిది కాదు. ఇలా చేస్తే నిద్రపట్టకుండా చేస్తుంది. కాబట్టి, భోజనానికి ముందే లేదా నిద్రించడానికి మూడు నాలుగు గంటల ముందే వ్యాయామం చేయాల్సి ఉంటుంది. నిద్రించడానికి ముందు యోగ చేయడం వల్ల విశ్రాంతి లభిస్తుంది.
 
ఇక గర్భధారణ సమయంలో ఒత్తిడి వివిధ రకాలుగా ప్రభావాలను చూపుతుంది. ఒత్తిడి నిద్రను దూరం చేస్తుంది. అందువల్ల నిద్రపోవడానికి ముందు ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం ఒక మంచి గోరువెచ్చని స్నానం లేదా మసాజ్ వల్ల స్ట్రెస్‌ను సాధ్యమైనంతవరకూ తగ్గించుకోవచ్చు. దీని వల్ల రాత్రుల్లో మంచి నిద్ర పొందుతారు. 
 
గర్భధారణ సమయంలో ఒత్తిడిని తగ్గించుకోకపోతే ఆ దుష్ప్రభావం కడుపులో పెరిగే శిశువు మీద కూడా పడుతుంది. కాబట్టి, గర్భిణీలు సాధ్యం అయినంత వరకూ ప్రశాంతంగా ఉండాలి.