మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (16:13 IST)

వెక్కిళ్లు విసిగిస్తున్నాయా..? ఏం చేయాలంటే?

ఒక్కోసారి వెక్కిళ్లు ఎంతకీ ఆగకుండా విసిగిస్తుంటాయి. అలాంటప్పుడు ఉసిరిక ఆకుల్ని నమిలి మింగితే మంచి ఫలితముంటుంది. గోరువెచ్చని నీళ్లలో కాసింత ఇంగువ వేసుకుని తాగినా వెక్కిళ్లు ఆగుతాయి. 
 
వేపాకు పొడి, ఉసిరి పొడి సమాన మోతాదులో తీసుకున్నా, శొంఠి పొడిలో తేనె కలిపి తీసుకున్నా వెక్కిళ్లు తగ్గిపోతాయి. అలాగే ఓ కప్పులో నీళ్లలో చెంచా మెంతులు చేర్చి మరగ కాచిన నీటిని తాగితే అదే పనిగా వచ్చే వెక్కిళ్లు వెంటనే నిలిచి పోతాయని వైద్యులంటున్నారు. 
 
అదే విధంగా కాగితంతో చేసిన సంచిని ముక్కుకు అడ్డుగా పెట్టుకుని రెండు నిమిషాల పాటు గాలిపీల్చి వదిలినా వెక్కిళ్లు నిలిచిపోతాయి.