గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2015 (18:59 IST)

రోజూ నెయిల్ పాలిష్‌ వేసుకుంటే బరువు పెరుగుతారట.. జాగ్రత్త సుమీ!

రోజూ నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా.. అయితే బరువు పెరుగుతారండోయ్. నిజమా..? అని షాక్ అయ్యారు కదూ. నిజమేనండి. రోజూ గోళ్ళకు రంగు వేసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు మన్నికగా ఉండేందుకు ట్రైఫీనైల్ ఫాస్పేట్ (టీపీహెచ్ పీ)వాడుతారు. దీనికి బరువును పెంచే గుణం ఉందని తాజా పరిశోధనలో తేలింది. 
 
పరిశోధనలో భాగంగా 3వేల వేర్వేరు గోళ్ల రంగుల్ని గుర్తించగా.. వాటిల్లో 49 శాతం ట్రైఫీనెల్ ఫాస్పేట్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ రంగును వేసుకున్న పది నుంచి పదిహేను గంటల్లో శరీరంలో టీపీహెచ్‌పీ మోతాదు ఏడు రెట్లు పెరుగుతుంది. దీని మోతాదు ఎంతంతకు పెరిగితే అంతకు బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ గోళ్లకు రంగు వేసుకుని, వాటిని తగిలించుకుంటే ప్రమాదం ఉండదని వారు సలహా ఇచ్చారు.
 
ఇకపోతే.. గతంలో నెయిల్ పాలిష్‌లలో ఇతర రసాయనాలు వాడేవారు. అయితే పునరుత్పాదకతకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో.. పరిశోధకులు ట్రైఫీనైల్ ఫాస్పేట్ వాడకం వైపు మళ్లారు. అయితే ఇది చాలా డేంజరస్ అని నిపుణులు గుర్తించారు.