మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (15:36 IST)

దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం కాదు..?

1. పోరాడేటప్పుడు తిరిగి పోరాడే అవకాశం లేదన్నట్లు పోరాడు..
ఎందుకంటే.. రేపటికి పోరాడే అవకాశం దొరకకపోవచ్చు..
 
2. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు..
ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. 
 
3. నీడనిచ్చే గూడు నేనే నువ్వు కట్టే బట్ట నేనే ఆయువు నేనే
ప్రాణవాయువు నేనే.. కాడె నేనే, పాడె నేనే.. 
నిన్ను కాల్చే కట్టే నేనే నేను తరువుని నీ బతుకుతెరువుని..
కన్ను విప్పి కాంచరా.. ఒక్క మొక్కైనా పెంచరా..
 
4. మనకంటే ఎక్కువ సంపాదించే వారితో పోటీపడి ఎక్కువ సంపాదించడానికి..
ప్రయత్నిస్తాం.. కానీ పక్కవాడు పది పైసలు దానం చేస్తే.. వానితో
పోటీపడి మనం రూపాయి దానం చేయాలని ఆలోచించం..
 
5. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం కాదు.. 
దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించడం..
ప్రతి పౌరుడిని ప్రేమించాలి..
ప్రతి మతాన్ని గౌరవించాలి..
జాతీయ సంపదను కాపాడాలి..