బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (16:41 IST)

స్త్రీలు మర్మాంగ ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి పొందాలంటే?

సాధారణంగా స్త్రీల మర్మాంగానికి ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. వీటివల్ల వారు చికాకు పడుతుంటారు. వైద్యులకు చూపించినా... ఈ ఇన్ఫెక్షన్ల బారి నుంచి ఉపశమనం పొందలేక పోతుంటారు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తూ.. పరిశుభ్రతను ఆచరిస్తే ఎలాంటి వైద్య సాయం అక్కర్లేదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
ముఖ్యంగా బిగుతుగా ఉండే అండర్‌వేర్‌లు (లో దుస్తులు), టైట్ జీన్స్ వంటిని ధరించడం అంత శ్రేష్టం కాదు. అలాగే, సిల్క్, పాలిస్టర్ కంటే పూర్తిగా కాటన్‌తో దుస్తులు ధరించడం మంచిది. సువాసనల కోసం వాడే స్ప్రేలను వినియోగించడం తగ్గించడం మేలు. ముఖ్యంగా యోని భాగంలో తడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, అండర్‌వేర్లను వేడినీటితో ఉతికి, వీలైతే మూడు నాలుగు చుక్కలు డెటాల్‌లో కలిపిన నీటిలో పిండి ఆరేయడం మంచిది.