బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 జులై 2016 (11:30 IST)

మహిళలూ రొమ్ము క్యాన్సర్‌కు చెక్ పెట్టాలా? రోజూ కప్పు అక్రోట్ తినండి

మాసానికి రెండుసార్లైనా జలుబు చేస్తుందా? ఎక్కువ పని చేయలేకపోతున్నారా? అయితే వ్యాధినిరోధక శక్తి తగ్గినట్లేనని గమనించండి. వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు సిట్రస్ ఫ్రూట్ల‌తో పాటు అక్రోట్‌లను కూడా తీసు

మాసానికి రెండుసార్లైనా జలుబు చేస్తుందా? ఎక్కువ పని చేయలేకపోతున్నారా? అయితే వ్యాధినిరోధక శక్తి తగ్గినట్లేనని గమనించండి. వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు సిట్రస్ ఫ్రూట్ల‌తో పాటు అక్రోట్‌లను కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉండటం వలన, శరీర నిరోధక వ్యవస్థను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచి వ్యాధులకు దూరంగా ఉండేలా సహాయం చేస్తుంది. రోజువారీ డైట్‌లో వీటిని చేర్చుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
ఇంకా అక్రోట్ రొమ్ము క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. రొమ్ము క్యాన్సర్ నుంచి దూరం కావాలనుకునే మహిళలు రోజు ఓ కప్పు ఆక్రోట్ తీసుకుంటే సరిపోతుంది. అక్రోటుకాయలు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌లను పుష్కలంగా కలిగి ఉండి, హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతాయి. అక్రోటుకాయలు, రోజు తినటం ద్వారా బీపీ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌ ఉండటం ద్వారా కొవ్వు స్థాయి తగ్గించబడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 
సాధారణంగా బరువు తగ్గాలని ప్రయత్నించేవారు అక్రోట్ తీసుకోవచ్చు. వారంలో రెండు సార్లు విత్తనాలను తినటం వలన 31 శాతం వరకు బరువు పెరుగుదలను నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.