శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 13 జులై 2014 (14:39 IST)

మొహంపై తెల్లటి మచ్చలు ఎందుకు వస్తాయి?

చర్మం శరీరానికి కవచంలా పని చేస్తుంది. ఇది అతి పెద్ద అవయవం. చర్మం సాధారణంగా 2 నుంచి 3 ఎమ్ఎమ్ మందం ఉంటుంది. సగటు చదరపు అంగుళానికి 650 చెమట గ్రంథులు, 20 రక్తనాళాలు, 60 వేల మెలనోసైట్స్, వెయ్యికి పైగా నరాలుంటాయి. అలాంటి చర్మం తెల్లమచ్చల బారిన పడటం మానసికంగా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. జీన్స్‌లో తేడా వల్ల మన రక్షణ వ్యవస్థ మెలనోసైట్స్ పైన దాడి చేయడం వల్ల ఆ ప్రాంతంలో మెలనోసైట్స్ నశించి ఆ ప్రాంతంలో తెల్లబడి ప్యాచెస్ ఏర్పడతాయి. స్త్రీ పురుషులనే తేడా లేకుండా విటిలిగో సంభవిస్తుంది.
 
ఈ మచ్చలు దీర్ఘకాలిక ఒత్తిడి, కాలిన గాయాలు, ప్రమాదం వల్ల, ఎండ వేడిమి, జన్యుపరమైన కారణాలు, దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు, కాలేయ విధులకు అంతరాయం ఏర్పడటం వల్ల, జీర్ణవ్యవస్థలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ రావడం వల్ల, బిగుతైన దుస్తులు ధరించడం వల్ల, అధిక ధూమపానం చేయడం వల్ల, మితిమీరిన కాస్మెటిక్స్ ఉపయోగం ఇలా అనేక కారణాల వస్తాయని నిపుణులు చెపుతున్నారు.