శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (13:40 IST)

క్యాట్‌వాక్‌ చేసేటప్పుడు మోడల్స్‌ నవ్వక పోవడానికి కారణమిదే!

క్యాట్‌వాక్ చేసే సమయంలో మోడల్స్ అస్సలు నవ్వరుగాక నవ్వరు. వీరు ఎందుకు నవ్వరన్న ప్రశ్న ఏ ఒక్కరికీ ఇప్పటికీ తెలియదు. అయితే, మోడల్స్ నవ్వకుండా ఉండటానికి గల కారణాలను మాత్రం ఆరా తీస్తే.... 
 
క్యాట్‌వాక్‌ సమయంలో మోడల్స్‌ గంభీరంగా, గుంభనంగా ఉండటమన్నది అనాదిగా వస్తోందట. ముఖ్యంగా 19, 20వ శతాబ్దపు మోడల్‌ ఫోటోగ్రఫీని పరిశీలించినా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుందట. పాత కాలపు మోడల్స్‌ హాట్‌ లుక్‌, ఆకట్టుకునే వస్త్రాలంకరణతో ఉన్నా సీరియస్‌ లుక్‌ను మెయింటైన్‌ చేసినట్టు తెలుస్తోంది. 
 
అంతేకాకుండా, నవ్వు మొహంతో ఉండటం కన్నా గాంభీర్యమే ఎక్కువ మందిని ఆకర్షిస్తుందనే ఓ సిద్ధాంతాన్ని ఫ్యాషన్‌ ప్రపంచం ఎప్పటి నుంచో ఫాలో అవుతోందట. దీనికితోడు తమ ఉత్పత్తులను పరిచయం చేసేటప్పుడు మోడల్స్‌ నవ్వకూడదని రూపకర్తలు కోరుతారట. ప్రోడక్ట్స్‌ను పరిచయం చేసే సమయంలో మోడల్స్‌ భావ వ్యక్తీకరణ చేస్తే.. వినియోగదారుడి దృష్టి ప్రోడక్ట్‌ మీద కాకుండా మోడల్‌ మీదకు మళ్లుతుందని చాలామంది భావిస్తారట. అందుకే క్యాట్‌ వాక్‌ చేసే సమయంలో మోడల్స్‌ నవ్వరని తెలిసింది.