స్త్రీకి 30 ఏళ్లు దాటితే ఆ ఛాన్స్ జారిపోతున్నట్లే...

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (20:25 IST)

pregnant woman

స్త్రీల గర్భ ధారణకు అనువైన వయసు 24 నుంచి 30 ఏళ్లని వైద్యులు చెప్తుంటారు. ఐతే 35 ఏళ్ల వరకూ గర్భం దాల్చే వీలున్నప్పటికీ 30వ సంవత్సరంలో పెళ్లయితే ఆరు నెలల లోపే గర్భం దాల్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ 30 ఏళ్ల వయసులో పెళ్లై ఆరు నెలలు దాటినా గర్భం దాల్చకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. అంతకంటే ముందు పెళ్లయితే సాధ్యమైనంత త్వరగా పిల్లల్ని కనే ప్రయత్నం చేయడం మంచిది. 
 
చదువు, కెరీర్ పరంగా గర్భ ధారణను వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల గర్భం దాల్చే అవకాశాలను చేతులారా పాడుచేసుకుంటారు. పూర్వం 35, 40 ఏళ్ల వయసులో కూడా పండంటి బిడ్డను ప్రసవించగలిగేవాళ్లు. కానీ కాలక్రమేణా పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లటం మొదలుపెట్టాయి. 
 
30 దాటిన తర్వాత గర్భం దాల్చగలిగినా పుట్టే పిల్లల్లో అవసరాలు ఏర్పడే ప్రమాదం వుంది. కాబట్టి ఆ వయసులోగానే పిల్లల్ని కనే ప్రయత్నం చేయడం మేలు. పురుషుల్లో కూడా 35 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత నుంచి వీర్య కణాల నాణ్యత తగ్గుతూ పోతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

ఆలివ్, కొబ్బరి నూనెల మిశ్రమాన్ని?

మృతకణాలు తొలగించుకునేందుకు ఖరీదైన క్లెన్సర్లు వాడటం కంటే కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్‌ల ...

news

ఐబ్రోస్‌ థ్రెడ్డింగ్‌ తర్వాత పింపుల్స్ వస్తే...

హైటెక్ సొబగుల ప్రపంచంలో ప్రతి మహిళ ముఖారవిందానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులోభాగంగా, ...

news

కాఫీ తాగితే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయా?

కాఫీ తాగితే కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కళ్ళ కింద ...

news

అలా వదిలేస్తే కేశాలు నిర్జీవంగా మారిపోతాయ్ జాగ్రత్త...

జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే ఎగ్ మిక్సింగ్ షాంపూలను ఎంచుకోవాలి. కనీసం రెండు ...