గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (11:25 IST)

మహిళలూ అలసటను నిర్లక్ష్యం చేయొద్దు.. బరువు పెరిగితే మాత్రం డేంజరే

మహిళలూ అలసటను నిర్లక్ష్యం చేస్తున్నారా? బరువు పెరుగుతున్నా కేర్ చేయట్లేదా? అయితే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా మహిళలు ఇంటి పరంగానూ, వృత్తి పరంగానూ ఉత్తమం

మహిళలూ అలసటను నిర్లక్ష్యం చేస్తున్నారా? బరువు పెరుగుతున్నా కేర్ చేయట్లేదా? అయితే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా మహిళలు ఇంటి పరంగానూ, వృత్తి పరంగానూ ఉత్తమంగా ఉండాలనే ఆలోచనతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపరు.

ఒంటి నొప్పులున్నా, అలసట, అసౌకర్యం వంటివి ఉన్నా శ్రద్ధ తీసుకోరు. కానీ నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. మహిళలు వారి శరీరంపై శ్రద్ధ పెట్టి రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అనేక వ్యాధులను ప్రారంభ రోగ నిర్ధారణ, సరైన చికిత్స చేయించుకుంటే తీవ్రమైన లేదా ప్రాణాంతకం కాకుండా నిరోధించవచ్చు.  
 
చాలామంది మహిళలు అనేక బాధ్యతల్లో మునిగిపోవుట వలన అసౌకర్యం, అలసట వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. బిజీ షెడ్యూల్ కారణంగా అలసినప్పుడు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే అలసట తగ్గినప్పుడు అది పెద్ద సమస్య కాదు. అయితే జీవితంలో అలసట ఒక బాగంగా మారితే కనుక అది దీర్ఘకాలిక అలసట సిండ్రోమ్ లక్షణంగా గుర్తించాయి. 
 
పురుషుల కంటే మహిళల్లో నాలుగు రెట్లు ఎక్కువగా ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. అలసట అనేది నిరాశ, లివర్ ఫెయిల్యూర్, రక్తహీనత, క్యాన్సర్, కిడ్నీ వైఫల్యం, గుండె వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, స్లీప్ అప్నియా, మధుమేహం వంటి అనేక వైద్య పరిస్థితులతో ముడిపడి ఉంది. అలసట రెగ్యులర్‌గా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి.
 
బరువులో స్వల్ప వైవిధ్యంను గమనిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే శరీర బరువు సగటున రోజుకు 2 నుంచి 4 పౌండ్ల బరువు కోల్పోతే చాలా సాధారణం అని చెప్పవచ్చు. అయితే ఆహారంలో ఎటువంటి మార్పులు లేకుండా బరువులో హెచ్చుతగ్గులను గమనిస్తే అది ఒక హెచ్చరికగా చెప్పవచ్చు.

బరువు ఆకస్మికంగా 10 పౌండ్ల లేదా ఎక్కువ బరువు పెరుగుట లేదా తగ్గుట సంభవిస్తే కనుక క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్ లోపం, క్లోమం, కడుపు, అన్నవాహిక ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ విధమైన మార్పులు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.