మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 మార్చి 2015 (18:22 IST)

మహిళలూ.. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి!

మహిళలూ.. రోజూ ఆరోగ్యకరమైన అల్పాహారంతో రోజును ప్రారంభించండి అంటున్నారు వైద్య నిపుణులు. శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి, వీలైనంత వరకు ఉడికించిన ఆహారానికి దూరంగా ఉండండి ఆకుకూరలు తీసుకోండి. జ్యూస్‌లకు బదులు పండ్లు తీసుకోండి. వాటిని సలాడ్ రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది. ఆకలితో ఉండకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినండి, ఎక్కువగా తినకండి. 
 
ఆహారం గురించి చికాకు తెచ్చుకోకండి. తేలికగా తినడమే ముఖ్య విషయం. మీరు జీవితకాలం కొనసాగించలేని ఆహారాన్ని తీసుకోకండి. కృత్రిమ పంచదారతో కూడిన కోకో వంటి శీతల పానీయాల జోలికి వెళ్ళకండి. 8 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోండి. మంచి సమతౌల్య ఆహరం తినండి. ఏ ఆహార సమూహాన్ని విడదీయకండి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, ముఖ్యమైన కొవ్వు కలిగిన పదార్ధాలను తీసుకోండి. ఫాట్‌, లో కెలోరీలు ఉండే ఫుడ్‌ను సమంగా తీసుకోండి.