బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By ivr
Last Modified: బుధవారం, 15 మార్చి 2017 (14:51 IST)

మార్చి 31 వరకూ ఫెమ్‌సైక్లోపీడియా ఎగ్జిబిషన్....

మహిళల చారిత్రక నెల మార్చి నెల అనేది తెలిసిందే. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. మార్చి నెలను మహిళల నెలగా పరిగణిస్తుంటారు. ఈ నేపధ్యంలో చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్, రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషనుతో కలిసి ఫెమ్ సైక్టోపీడియా: జెన్ డూడల

మహిళల చారిత్రక నెల మార్చి నెల అనేది తెలిసిందే. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. మార్చి నెలను మహిళల నెలగా పరిగణిస్తుంటారు. ఈ నేపధ్యంలో చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్, రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషనుతో కలిసి ఫెమ్ సైక్టోపీడియా: జెన్ డూడల్డ్ పోట్రెయిట్స్ మరియు స్టోరీ టెల్లింగ్ ద్వారా వివిధ వయసుల్లో ఆమె కథలు అనే టైటిల్‌తో చెన్నైలోని అమెరికన్ సెంటర్లో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. 
 
ఫెమ్ సైక్లోపీడియాలో అమెరికా మరియు ఇండియన్ మహిళల 30 జంటలు, వారు వివిధ రంగాలలో సాధించిన విజయాలను తెలుపుతూ డూడుల్డ్ పోట్రెయిట్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. దీనిని రూపొందించినది రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ మిస్ కృతి జయకుమార్. ఈ ప్రదర్శనను సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ వీక్షించవచ్చు. ఈ ప్రదర్శన మార్చి 31, 2017 వరకూ యూఎస్ కాన్సులేట్ లోని అమెరికన్ సెంటర్ లోపల తిలకించవచ్చు.