బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:08 IST)

కరివేపాకు పొడిని పాలలో కలిపి తీసుకుంటే..?

నేటి తరుణంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అందుకు ఏం చేసినా.. ఎలాంటి ఫలితాలు.. కనిపించలేదని బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. పట్టుకుచ్చులా మెరిసే కురులు మనల్ని అందంగా చూపుతాయి. అలాంటి కురులు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు పోషకాహారానికి తగిన ప్రాధాన్యమివ్వాలి. ఆకుకూరలు, గుడ్లు, పాలు, పండ్లు, చేపలు ఎక్కువగా తీసుకుంటే క్యాల్షియం ఎక్కువగా లభించి, కురులు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
 
1. జుట్టు కలరింగ్ చేసుకోవాలంటే.. బీట్‌రూట్, క్యారెట్ రసాలను తలస్నానం చేసిన తరువాత కండిషనర్‌లా తలకు పట్టిస్తే చాలు.
 
2. పెసరపప్పు పిండి, మెంతి పిండిని నీళ్లలో కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని తలకు రాయాలి. గంట తరువాత నీళ్లతో కడిగితే కురులు అందంగా మెరిసిపోతాయి.
 
3. కరివేపాకును ఎండబెట్టి పొడిచేసుకుని ఓ బాటిల్‌లో నిల్వచేసుకోవాలి. ప్రతిరోజూ గ్లాస్ మజ్జిగలో ఈ పొడిని కలిపి తీసుకుంటే జుట్టు పట్టుకుచ్చులా పెరుగుతుంది. 
 
4. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తీసుకుంటే దానిలోని పోషకాలు జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.
 
5. కొబ్బరినూనెలో తమలపాకు రసం కలిపి మాడుకు మర్దన చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి కుదుళ్లు దృఢపడతాయి.
 
6. వాల్‌నట్స్‌ను దంచి మెత్తగా చేసి నీళ్లలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు ముదురు ఎరుపు రంగుగా మారుతుంది.