శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By chitra
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2015 (18:48 IST)

ఇంట్లోవుండే వాటితోనే అందంగా ఎలా ఉండాలి.....

'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నారు మన పెద్దలు. అలాంటి ఆరోగ్యాన్ని ఇంకొంచెం అందంగా మలుచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందా.. 
 
* రెండు స్పూన్‌ల నిమ్మరసానికి, 2 స్పూన్‌ల రోజ్‌వాటర్‌ని కలపాలి. ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ఉండే నల్ల మచ్చలు తొలగిపోతాయి. 
 
* ముఖంలో అధికంగా పింపుల్స్‌ (మొటిమలు)తో బాధపడుతుంటే కలబంద రసాన్నిముఖానికి పట్టించి కొద్దిసేపు తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలాతరచూ చేస్తే సమస్య తగ్గుతూ వస్తుంది.
 
* గుడ్డులోని తెల్లసొన, కొద్దిగా ఆలివ్‌నూనె, కొంచెం పెరుగు కలుపుకొని ముఖానికి పట్టించి బాగా మర్ధన చేస్తే అరగంటయ్యాక కడిగేస్తే చర్మం తాజాగా నిగనిగలాడుతుంది. 
 
* వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా కలుగుతాయి. ఈ కాలంలో వేడినీటిలో స్నానం చేసేట‌ప్పుడు ఆ వేడినీటిలో కొబ్బరినూనె కలిపితే చర్మం నిగనిగలాడుతుంది.
 
* కొందరికి గోళ్లు విరిగిపోతుంటుంది. అలాంటప్పుడు రోజూ ఐదు నిమిషాలు ఆలివ్‌నూనెతో మర్దన చేస్తే గోళ్లు బలంగా, ఆరోగ్యంగానూ ఉంటాయి. 
 
* ఎండకు కమిలిన చర్మానికి సాంత్వన చేకూరాలంటే, బంగాళాదుంపల్ని తరిగి ఆ ప్రాంతంలో ఉంచాలి. పది నిమిషాలయ్యాక తీసి చన్నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే పెరుగులో చెంచా బంగాళాదుంప గుజ్జును కలిపి పక్కన పెట్టుకోవాలి. అర్థగంటయ్యాక ప్యాక్‌లా వేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలాక్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంలో ముడతలు రావు. 
 
* కళ్ల కింద నల్లటి మచ్చలతో బాధపడుతున్నారా అయితే ఈ గుజ్జులో తేనె కలిపి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత వేడినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల నల్లమచ్చలు, కళ్ల మంటలూ, దురదా తగ్గుతాయి.
 
* తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి వేసుకోవాలి. అరగంటయ్యాక కడిగేస్తే చర్మం తాజాగా నిగనిగలాడుతుంది. 
 
* బొప్పాయి పండు గుజ్జు తీసుకుని, ఈ గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.. అప్పుడప్పుడు పసుపు, తేనె, కొంచెం రోజ్ వాటర్  కలిపి ముఖానికి రాసుకుని వారానికి కాసేపు వదిలేసినా మంచిదే.