గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:00 IST)

కోపాన్ని తగ్గించాలంటే.. ఇలా చేయాలి..?

కోపాన్ని అణచుకోలేకపోతున్నారా.. అయితే కాస్త వెడల్పయిన గిన్నెలో బాగా చల్లగా ఉన్న నీళ్లు పోసి అందులో 30 సెకండ్ల పాటు చేతులను గానీ, ముఖాన్ని గానీ ముంచి బయటకు తీయండి. విచిత్రంగా అనిపించినా ఇది తక్షణం కోపం, ఆందోళన తగ్గడానికి తోడ్పడుతుంది.
 
మనసును స్థిమితపరచి ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తుంది. వ్యక్తిత్వ సమస్యలతో సతమతమయ్యేవారికోసం రూపొందించిన డీబీటీ-డయలెక్టికల్ బిహేవియర్ థెరపీలో ఇదొక పద్ధతి.
 
భావోద్వేగాలకు లోనైనప్పుడు మెదడు కొత్త సమాచారాన్ని సరిగా గ్రహించలేదు, విడమరచుకోలేదు. నాడీవ్యవస్థ స్థిమితపడితే తప్ప ఇది తిరిగి కుదురుకోదు. చల్లని నీటిలో ముఖాన్ని ముంచడం ద్వారా పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపితమై భావోద్వేగాలు తగ్గటానికి తోడ్పడుతుంది.