Widgets Magazine

లైంగికంగా ముగ్గురు వేధిస్తున్నారు... ఆత్మహత్య చేసుకోబోయి అమ్మను కాల్చి చంపేశా...

మంగళవారం, 16 మే 2017 (16:41 IST)

Widgets Magazine

మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన చరియా జాక్సన్ అనే మహిళ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను పంచుకుంది. అభంశుభం తెలియని వయసులోనే తను లైంగిక వేధింపులకు గురయ్యాననీ, తనపై కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడులు చేసేవారిని ఆమె వాపోయింది. చిన్న వయసులో తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి తల్లికి చెప్పాలంటే భయపడేదాన్ననీ, అందువల్ల ఆ బాధను అలాగే కొన్నేళ్లు భరించానని చెప్పుకొచ్చింది. 
 
ఐతే 12 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ ఈ లైంగిక దాడి నుంచి ఎలాగో తను తప్పించుకోవాలని ప్రయత్నం చేశాననీ, ఆ క్రమంలో ఇంట్లో వున్న రివాల్వర్ తీసుకుని దానితో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించింది. ఐతే అనూహ్యంగా ఆ రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కగానే ఆ బుల్లెట్ తనకు బదులుగా తన తల్లికి తగిలి ఆమె చనిపోయిందనీ, దానితో తనను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారని వెల్లడించింది. 
 
కోర్టు అడిగిన ప్రశ్నలకు వేటికీ తను సమాధానం చెప్పకపోవడంతో తనను బాలనేరస్తుల కారాగారానికి తరలించారని పేర్కొంది. అక్కడ తనకు పలువురు మానసిక వైద్యులు చికిత్స ఇచ్చారనీ, ఆ క్రమంలో 15 ఏళ్లు వయసు వచ్చాక తను ఎలాంటి దారుణమైన లైంగిక దాడులకు గురయ్యానోనన్న విషయాలన్నీ వారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పింది. అలా శిక్షా కాలంలో తను ఓ నాయకురాలిగా తయారయ్యాననీ, జైలుకు వచ్చే ఎందరో మహిళల సమస్యలపై క్షుణ్ణంగా తెలుసుకుని తగిన సూచనలు ఇచ్చేదాన్ననని వెల్లడించింది. 
 
12 ఏళ్ల సమయంలో జైలుకు వెళ్లిన ఆమె 21 ఏళ్ల నాటికి శిక్షా కాలం ముగిసి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఒంటరి జీవితం ఎలా గడపాలా అని ఎదురుచూస్తుండగా ఓ టెలివిజన్ ఛానల్ హోస్ట్ గా తనకు అవకాశం వచ్చిందనీ, ఇక అక్కడ్నుంచి తను వెనుదిరిగి చూసే అవకాశమే లేకుండా పోయిందని చెప్పింది. సమస్యలకు భయపడి తనలా ఆత్మహత్య యత్నం చేయకూడదనీ, సమస్యపై పోరాటం చేయడం నేర్చుకోవాలని ఆమె తన సందేశాన్ని ఇచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

తేనెతో ఫేషియల్ మాస్క్.. స్నానం చేసే నీటిలో తేనెను కలిపి?

యాంటీ బాక్టీరియా గుణాలు ఉన్న తేనె మొటిమలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మాయిశ్చరైజర్‌లో ...

news

మాతృదినోత్సవం.. ''అమ్మ''ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారా? లేకుంటే అదే పరిస్థితి?

అమ్మ.. అంటే ఆనందం. కష్టం కలిగినా.. సంతోషం కలిగినా తొలి మాట అమ్మా.. అంటాం. తొమ్మిది ...

news

మహిళలు కొబ్బరినూనె వాడితే.. పొట్టచుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుందట..

కొబ్బరినూనెతో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య ...

news

అందంగా కనిపించాలంటే.. బనానా ఫేషియల్ ట్రై చేయండి..

అందంగా కనిపించాలంటే.. పండ్ల ఫేషియల్స్ ట్రై చేయండి. ఫేస్ ప్యాక్‌లకి, ఫేషియల్‌కు పండ్లు ...