గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By chitra
Last Updated : మంగళవారం, 19 జనవరి 2016 (09:20 IST)

దూర ప్రయాణాల కోసం లగేజీ టిప్స్‌..

చాలా మంది దూర ప్రయాణాలు చేసేవారు తమ లగేజీనికి అనువైన బ్యాగ్‌లను ఎంచుకోలేక నానా తంటాలు పడుతుంటారు. పైపెచ్చు. సాధారణ బ్యాగుల్లో పెద్దమొత్తంలో లగేజీని పెట్టుకుని దాన్ని మోయలేక మోస్తుంటారు. ఇలాంటి వారు చిన్నపాటి టిప్స్‌ను పాటించినట్టయితే, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ లగేజీని మీ వెంట సురక్షితంగా తీసుకెళ్లవచ్చు. అలాంటి లగేజీ టిప్స్ ఎంటో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
తక్కువ బరువును మాత్రమే మోయగలం అనుకునే వారు వీల్స్‌ ఉన్న బ్యాగ్‌లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. రోలింగ్‌, బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్స్‌ కూడా ప్రయాణానికి అనువైనవే. షోల్డర్‌ బ్యాగ్‌ ఉంటే మంచిది. షోల్డర్‌ బ్యాగ్‌ను తగిలించుకుని మరో బ్యాగ్‌ను చేత్తో పట్టుకుని, రోలింగ్‌ బ్యాగ్‌ను మరో చేత్తో పట్టుకుంటే దాదాపుగా లగేజీ మొత్తం మీ చేతుల్లో ఉన్నట్లే. 
 
బ్యాగ్‌లో ఎంత బాగా సర్దినా బట్టలు ముడతలు పడతాయి. అలాంటప్పుడు నీట్‌గా ఇస్త్రీ చేసుకుని తెచ్చుకున్న బట్టలు కాస్తా ఇలా అయిపోయాయే అని అసహనం కలుగుతుంది. అందుకే టూర్‌లకి వెళ్లేప్పుడు టీ షర్ట్‌లు, జీన్స్‌ లాంటి దుస్తులకే అధిక ప్రాధాన్యతనిస్తే మంచిది. 
 
కొన్ని ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను అదనంగా పెట్టుకోవడం కూడా మంచిది. బట్టలపై సాస్‌, కర్రీలాంటివి పడితే వాటిని ఈ బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు. డ్యామేజ్‌కు గురయ్యే వస్తువులను బట్టలు సర్దుకున్న బ్యాగులో పెట్టుకోవద్దు. పొరపాటున అవి లీకయినా, పగిలినా బట్టలన్నీ పాడయిపోయే అవకాశం ఉంటుంది.