శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By CVR
Last Updated : సోమవారం, 13 జులై 2015 (17:01 IST)

బిడ్డకు తల్లి పాలు మేలే.... అందులో ఉండే పోషకాలేంటో.. తెలుసా?

పుట్టిన బిడ్డలకు కనీసం ఆరు నెలలైనా తల్లిపాలనే పట్టించాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే తల్లిపాలలో ఉండే పోషకాలు ఏమిటో తెలుసా? తల్లిపాలలో ఎక్కువ భాగం నీళ్లే ఉంటాయి. 100 మి.లీ పాలలో ఒక గ్రాము ప్రోటీన్లు, 100 ఎంఎల్ పరిమాణంలో 3.5 గ్రాముల కొవ్వులు, ప్రతి 100 ఎంఎల్‌కూ 7 గ్రాముల ల్యాక్టోజ్ ప్రొటీన్లు ఉంటాయి. అవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. 
 
అంతేకాకుండా తల్లిపాలలో కొవ్వులు కూడా చాలా పొడవైన ఫ్యాటీ యాసిడ్ చైన్ల దూరంలో ఉండి మెదడుకు మేలు చేసే పోషకాలతో ఉంటాయి. ల్యాక్టోజ్‌లో గెలాక్టొసైడ్ అనే పోషకం మెదడు ఎదుగుదలకు బాగా ఇపయోగపడుతుంది. అంతేకాకుండా తల్లి పాలు పట్టించడం వలన ఇటు బిడ్డకు మాత్రమే కాకుండా తల్లికి కూడా మేలే. ముఖ్యంగా బిడ్డకు పాలు ఇవ్వడం వలన ఆ తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ఆస్కారమే ఉండదని వైద్యులు తేల్చి చెబుతున్నారు.