మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Selvi
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2015 (18:56 IST)

వృద్ధాప్యంలో పురుషుల కంటే మహిళల బుర్రే చురుగ్గా పనిచేస్తుందట!

వృద్ధాప్యంలో మహిళల మెదడే చురుగ్గా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. వయస్సు పెరిగిన పురుషుల కంటే మహిళల మెదడు చురుగ్గా పనిచేస్తుందని న్యూకేజిల్, కేంబ్రిడ్జి యూనివర్శిటీలు నిర్వహించిన పరిశోధనలో తేల్చింది. అంతేగాకుండా మహిళలు ఎక్కువ కాలం పాటు తెలివితేటలు కలిగివుంటారని, పురుషుల్లో ఆ తెలివి తేటలు వయస్సు పెరిగే కొద్దీ తరుగుతూ వస్తాయని పరిశోధనలో వెల్లడైంది. 
 
మహిళల కంటే పురుషులు మాత్రం శారీరకంగాను, మానసికంగాను త్వరగా అలసిపోతున్నారని తాజా అధ్యయనంలో తెలియవచ్చింది. గడచిన ఇరవై ఏళ్లలో మహిళల సగటు జీవితకాలం బాగానే పెరిగిందని, మహిళల్లో మతిమరుపు లాంటి సమస్యలు చాలామటుకు వృద్ధాప్యంలో ఉండట్లేదని.. అదే పురుషుల విషయంలో అందుకు విభిన్నంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. 
 
దీనిపై కేంబ్రిడ్జి ప్రొఫెసర్ జాగర్ మాట్లాడుతూ.. కీలక పదవుల్లో ఉన్న మహిళలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలపై జరిపిన పరిశోధనలో వృద్ధాప్యంలో మహిళలే చురుగ్గా వున్నారని, పురుషులకు ఆ లక్షణాలు ఆశించిన స్థాయిలో లేవని తేలిందన్నారు.