Widgets Magazine

యోగా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి..?

WD
గెలిచినవారి జీవితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే వాటినే గెలుపుకు దారి అనుకుంటూ కలల్లో విహరించడం... ఆ దారిలో ఓటములు ఎదురైనప్పుడు కుంగిపోవటం సమంజసం కాదు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి. అది మనసుకు అలవాటుకు చేసుకోవాలి. ఇది యోగాభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది. అయితే కొంతమందికి అసలు యోగా ఎందుకు చేయాలి...? అనే సందేహం వస్తుంది.

పుట్టినప్పటి నుంచి మనం ఎన్నోసార్లు రకరకాల దుస్తులను ధరిస్తూ... మారుస్తూ ఉంటాము. ఎన్నోసార్లు ఇల్లు మారుతూ ఉంటాము. అలాగే భుజించే ఆహారం కూడా రకరకాల రుచులలో భుజిస్తున్నాము. కాని మార్పు లేకుండా కడవరకూ మనతో ఉండేది శరీరం.

కనుక మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, మన కల నెరవేర్చడానికి ఆ శరీరం తోడ్పడుతుంది. మనసు మీరు చెప్పిన విధంగా వినకుండా, దాని ఇష్ట ప్రకారం ఆలోచనలను పెంపొందిస్తుంది. కనుక మీ కలలు నెరవేరాలంటే, మీ మనసు పట్టుదలతో తోడ్పడాలి.

మీ మనసు, శరీరం మీకు నచ్చినవిధంగా పనిచేయాలంటే వాటి రెండింటినీ మీ అదుపులోకి తెచ్చుకోవాలి. అలా అనుకూలంగా మరల్చగలిగే శక్తి యోగా ఇస్తుంది. కనుక యోగాభ్యాసం ఎంతైనా అవసరం. కుళ్లూ, కుతంత్రాలతో నిండిపోయిన నేటి సమాజంలో యోగా తప్పనిసరి.దీనిపై మరింత చదవండి :  

యోగా

పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి

మొదటగా చదునైన నెలపై నిటారుగా నిలబడాలి. ఈ స్థితిలో కాళ్ళు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండాలి. ...

అర్ధధనురాసనంతో శరీరానికి కొత్త బలం

సంస్కృతంలో ధనుస్ అంటే బాణం. యోగాసనాలలో శరీరాన్ని బిగుతుగా ఆ ఆకృతిలోకి వంచడాన్ని ...

దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం

నౌకాసనం వేసే వారు చదునైన నేలపై సాధన చేయాలి. ఈ ఆసనంలో శరీరం నౌక ఆకారంలో తయారవుతుంది. ...

పవనముక్తాసనంతో ఉదరకోశవ్యాధుల నుంచి విముక్తి

పవనముక్తాసనం అనే సంస్కృత పదం. వాస్తవానికి మూడు పదాల మిశ్రం. ఇందులో పవన అంటే వాయు లేదా ...

Widgets Magazine