Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అర్ధధనురాసనంతో శరీరానికి కొత్త బలం

Widgets Magazine

సంస్కృతంలో ధనుస్ అంటే బాణం. యోగాసనాలలో శరీరాన్ని బిగుతుగా ఆ ఆకృతిలోకి వంచడాన్ని అర్ధధనురాసనం అంటారు. ఒక క్రమ పద్దతిలో వళ్ళు వెనక్కి విరిచి పాదాల పైభాగాన్నిచేతులతో పట్టకునే విన్యాసమిది.

చదునైన నేలపై బోర్లా పడుకోవాలి.
గడ్డం నేలపై ఆనించి ఉంచాలి.
భుజాలను శరీరానికి ఆనుకుని ఉండేలా చూడాలి.
పాదాలను కాస్త యడముగా ఉంచాలి.
కండరాలు చాలా వదులుగా ఉండేలా చూసుకోవాలి.
సాధారణంగా గాలి పీల్చుకోవాలి.
కాళ్ళను మెల్లగా వెనక్కి వంచాలి.
చేతులతో చీలమండను గట్టిగా పట్టుకోవాలి.

తల, మెడను మెల్లగా వెనక్కి వంచాలి.
ధీర్ఘంగా గాలి పీల్చుకోవాలి. తరువాత 10 సెకనులలో గాలి పీల్చుకోవడం పూర్తికావాలి.
కనీసం 3 సెకనులు ఆగి గాలి వదలడం ఆరంభించాలి.
గాలి వదలడం 15 సెకన్లలో పూర్తి కావాలి.
కాళ్ళు వెనక్కు లాగాలి.
క్రమంగా మోకాళ్ళు, బొటన వేళ్ళు దగ్గరకు చేర్చాలి.
వాటిని దగ్గరకు చేర్చకపోతే గరిష్టంగా వెనక్కు వంగే అవకాశం ఉండదు.

WD
ఉపయోగాలు
అర్ధధనురాసనం శరీరానికి శక్తి, బలాన్ని ఇస్తుంది. శరీర అంతర్భాగాలకు బలం చేకూరుతుంది. మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థ ఉత్తేజమవుతాయి.

జాగ్రత్తలు
హరేనియా, పెద్దప్రేవు, పొట్ట అల్సర్లు, గుండె జబ్బు, రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయడం అంత మంచిది కాదు. ఉదర సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు పూర్తిగా నయమయ్యేంత వరకూ ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
సంస్కృతంలో ధనుస్ అంటే బాణం. యోగాసనాలలో

యోగా

దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం

నౌకాసనం వేసే వారు చదునైన నేలపై సాధన చేయాలి. ఈ ఆసనంలో శరీరం నౌక ఆకారంలో తయారవుతుంది. ...

పవనముక్తాసనంతో ఉదరకోశవ్యాధుల నుంచి విముక్తి

పవనముక్తాసనం అనే సంస్కృత పదం. వాస్తవానికి మూడు పదాల మిశ్రం. ఇందులో పవన అంటే వాయు లేదా ...

విపరీత కరణి ఆసనం

మీరు ఈ ఆసనం వేయటానికి ముందు చాపపై పడుకోవాలిమీ రెండుకాళ్లను ఒకదానికొకటి దగ్గరగా ...

నరాలను ఉత్తేజపరిచే పశ్చిమోత్తానాసనం

కాళ్లను సమాంతరంగా ముందుకు చాపండి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. కాళ్లు రెండూ దగ్గరగా ...

Widgets Magazine