కాళ్లను సమాంతరంగా ముందుకు చాపండి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. కాళ్లు రెండూ దగ్గరగా చేర్చండి. మోకాళ్లు సమాంతరంగా ఉండాలి. అలా అని వాటిని మరీ సాగదీయకండి.మీ చేతుల్ని కాళ్ల వెలుపల నుంచి ముందుకు చాపి ఉంచండి. శ్వాస పీలుస్తున్నప్పుడు చేతులను మీ భుజాలపైగా లేపి ఉంచండి. మీ వెన్నెముకను వీలైనంత నిటారుగా నిలిపి ఉంచండి. ఈ స్థితిలో శ్వాస వదులుతూ కూర్చున్న స్థితిలోనే కటిభాగం నుండి ముందుకు వంగడం ప్రారంభించండి. చివరగా, పాదాలను, మడమలను, పిక్కలను పైకి లేకుండా నేలకు ఆనించాలి లేదా మీ చేతులు ఎంతమేరకు ముందుకు వంగగలవో అంతవరకూ వంచి ఉంచండి. ఈ భంగిమలో మీ వెన్నెముక కదలిక లేకుండా స్థిరంగా ఉంటుంది. ఒకవేళ మీ చేతులు పాదాలను చేరుకోకపోయినట్లయితే పాదం అడుగుభాగాన్ని తాడుతో కట్టి దానిని చేతులతో పట్టుకుని వంగాలి. మీ వెన్నెముక రక్షణపై స్పృహ కలిగి ఉండాలి. తాడును ఉపయోగిస్తున్నప్పుడు మోచేతులను సమానంగా ఉంచండి. మోకాళ్లు పైకి లేవకుండా సమాంతరంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఇలా మోకాళ్లను సమాంతరంగా ఉంచడం ఇబ్బంది కల్గిస్తే మెల్లగా వాటిని వంచండి. అభ్యాసం చేసే కొద్ది మీరు మోకాళ్లను పూర్తిగా నేలకు ఆనించగలరు.