చేతులను కింద ఆనిస్తూ మోకాళ్లను కాస్త భూమికి తాకేవిధంగా ముందుకు వంగి కూర్చోండి. మీ చేతివెళ్లను భూమికి తాకిస్తూ రెండు అరచేతులను భూమిపై ఉంచండి. అయితే ఈ దశలో మీ చేతివేళ్లు వెనుకకు తిరిగి ఉండేటట్లు అరచేతులను ఉంచండి. మోచేతుల వద్ద మడిచి బలంగా ఉంచండిమెల్లగా రెండు కాళ్లను సమానంగా కాస్తంత దూరంగా జరిపి జాగ్రత్తగా ముందుకు జరిగి మెల్లగా వీపు భాగాన్ని పైకి లేపండివీపు భాగాన్ని పైకి లేపిన తర్వాత, మీ కాళ్లను దగ్గరకు జరిపి నిటారుగా ఓ బద్దలా ( భూమికి సమాంతరంగా) ఉంచుతూనే మీ వక్షస్థలం, మెడ, తల భాగాలను కూడా భూమికి సమాంతరంగా ఉంటేట్లు చేయండి. అలానే కొంతసమయం చేసి తిరిగి మొదటి స్థానానికి వచ్చేయండి. మెల్లగా కాళ్లను మడిచి మోకాళ్లను భూమిపై పెట్టండి.ఇప్పుడు చేతులను భూమిపై నుంచి తీసివేసి మమూలుగా కూర్చోండి.