Astrology Daily Horoscope

Notifications

తేదీని ఎంచుకోండి
మేషం మేషం
చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ

మేషం: అశ్వని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఉద్యోగ రంగంలో మీరు చేపట్టిన పనులు అనుకున్న విధంగా ముందుకుసాగి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది.

రాశిచక్ర అంచనాలు
వృషభం వృషభం
ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో

వృషభం : కృత్తిక 2,3,4 పాదాలు రోహిణి ముగశిర 1,2 పాదాలు. అవకాశాలు రావడంతో మీ కార్యకలాపాలను విస్తరించే ఆలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తాయి.

రాశిచక్ర అంచనాలు
మిథునం మిథునం
కా, కీ, కూ, ఖం, జ, ఛ, కే, కో, హ

మిథునం : మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. ఉద్యోగంలో పనిభారం పెరిగినా మీ సమర్థతతో బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ ఇతరులకు హామీలు ఇవ్వడంలో జాగ్రత్త అవసరం.

రాశిచక్ర అంచనాలు
కర్కాటకం కర్కాటకం
హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో

కర్నాటకం : పునర్వసు 4వ పాదం పుష్యమి, ఆశ్లేష బంధించిన ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణం చేయాల్సి వస్తే ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి.

రాశిచక్ర అంచనాలు
సింహం సింహం
మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే

సింహం : ముఖ, సుబ్బ, ఉత్తర 1వ పాదం. వ్యాపారంలో మీరు చేసిన ప్రయత్నాలకు మంచి స్పందన లభించి కొత్త లాభదాయక అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు రావడంతో. బాధ్యతలు మరింత పెరిగి అవకాశం ఉంది.

రాశిచక్ర అంచనాలు
కన్య కన్య
టో, పా, పి, పూ, షం, ణా, ఢ, పే, పో

కన్య : ఉత్తర 2,3,4 పాదాలు హస్త చిత్త 1,2 పాదాలు, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యంలో స్వల్ప అలసట కనిపించే అవకాశం ఉన్నందున విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి.

రాశిచక్ర అంచనాలు
తుల తుల
రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే

తుల : చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు. కొత్త పరిచయాల ద్వారా వ్యక్తిపరమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరగడంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.

రాశిచక్ర అంచనాలు
వృశ్చికం వృశ్చికం
తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ

వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనురాధ. జేృష్ణ 1,2,3,4 పాదాలు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు కంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత పాటిస్తే అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు.

రాశిచక్ర అంచనాలు
ధనస్సు ధనస్సు
యే, యో, బా, బీ, భూ, ధా, భా, డా

ధనుస్సు : మూల పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు, ఉత్తరషాడ 1వ పాదం ఉద్యోగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చి భవిష్యత్ అభివృద్ధికి మార్గం చూపుతాయి. దూర ప్రయాణం లేదా ముఖ్యమైన సమావేశం ద్వారా ఉపయోగకరమైన పరిచయం ఏర్పడుతుంది.

రాశిచక్ర అంచనాలు
మకరం మకరం
బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ

మకరం : ఉత్తరషాడ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు. గతంలో చేసిన కృషికి తగిన ఫలితం లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ అవసరాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తవుతుంది.

రాశిచక్ర అంచనాలు
కుంభం కుంభం
గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, ద

కుంభం : ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1,2,3 పాదాలు. కొత్త ఆలోచన కార్యరూపం ఇవ్వడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. స్నేహితులు లేదా సహచరుల సహకారంతో మీరు ఊహించిన పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు.

రాశిచక్ర అంచనాలు
మీనం మీనం
దీ, దూ, శ్య, ఝ, థా, దే, దో, చా, చి

మీనం : పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు.

రాశిచక్ర అంచనాలు

శుభమా అని గృహ ప్రవేశం చేస్తుంటే, రూ. 50 వేలు ఇవ్వలేదని హిజ్రాలు డ్రెస్ అంతా ఎత్తి చూపించారు, వీడియో

ప్రియురాలికి ఐ-ఫోన్ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్, ఖమ్మం వద్దకు రాగానే...

ప్రియురాలికి ఐ-ఫోన్ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్, ఖమ్మం వద్దకు రాగానే...ఇటీవలి కాలంలో ప్రియుడి కోసం ప్రేయసి, ప్రియురాలి కోసం ప్రియుడు దొంగలుగా మారుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ ప్రియుడు తన ప్రేయసికి ఐ-ఫోన్ బహుమతిగా ఇచ్చేందుకు నేరపూరితమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. గంజాయి స్మగ్లింగ్ చేసి తద్వారా డబ్బు సంపాదించి తన ప్రేయసికి ఐ-ఫోన్ కొనివ్వాలని నిర్ణయించుకున్న అతడు ప్రణాళిక రచించాడు. అది కాస్తా బెడిసికొట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన 21 ఏళ్ల మిత్ర చైతన్య తన ప్రియురాలు హేమలతకు ఐ-ఫోన్ గిఫ్టుగా ఇవ్వాలని గత కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నాడు. డబ్బు లేకపోవడంతో అతడి వల్లకాలేదు. చివరికి అతడికి ఓ ఐడియా వచ్చింది.

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియోద్వాపరయుగంలో ద్వారకాధీశుడు, మధురాధిపతి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజును నేడు హిందువులందరూ భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కృష్ణుడు జన్మించిన మధుర చెరసాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల స్థలం ఇప్పటికీ ఉంది. దీనిని 'శ్రీ కృష్ణ జన్మభూమి' ఆలయ ప్రాంగణంలో అత్యంత పవిత్రమైన 'గర్భ గృహం' రూపంలో సంరక్షిస్తున్నారు. దేవకి, వసుదేవులను కంసుడు బంధించిన అసలు చెరసాల ఉన్న స్థలంలోనే ఈ చిన్న భూగర్భ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రాచీన రాతి గోడల ఆనవాళ్లను, కృష్ణుడి జన్మస్థాన వేదికను చూడవచ్చు.

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)నేపాల్‌లో ఆకస్మిక వరదలు రావడానికి కొన్ని రోజుల ముందు పలాంచోక్ భగవతి అమ్మవారి విగ్రహం నుండి నీటి బిందువులు (అంటే చెమట లాగా) కారిన సంఘటనను భక్తులు ఒక దైవిక హెచ్చరికగా నమ్ముతున్నారు. నేపాల్‌లోని కావ్రేపలాంచోక్ జిల్లాలో కొండ శిఖరంపై ఉన్న పలాంచోక్ భగవతి ఆలయం, దేశంలోనే అత్యంత శక్తివంతమైన పురాతన శక్తి పీఠాలలో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయం నేపాల్‌లోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో ఉన్న భగవతి అమ్మవారి విగ్రహం ఒకే నల్లరాతితో అందంగా చెక్కబడిన మూడు అడుగుల ఎత్తు కలిగినది. ఈ అమ్మవారి విగ్రహం పద్దెనిమిది చేతులతో దర్శనమివ్వడం ప్రత్యేకత. అంతేకాకుండా ఇది చాలా పురాతనమైనది, అంటే సుమారు 1300 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది. ఈ భగవతి అమ్మవారు, నేపాల్‌లోని ఇతర భగవతి అమ్మవార్లందరికీ పెద్దగా పరిగణించబడుతుంది.

Krishna Jayanti 2026 Significance : శ్రీకృష్ణ జయంతి పూజ.. కృష్ణుని జననానికి ఆధారాలు ఉన్నాయా?