జైలర్ : ఒరేయ్ జగ్గు నిన్ను పది రోజులు ఎక్కువగా జైలులో ఉంచాం రా.. ఏమీ అనుకోకు... జగ్గు : మనిషన్నాక ఇలాంటివి సహజం.. పోనీలెండి ఈ సారి వచ్చినప్పుడు పది రోజులు మినహాయించుకోండి.
యువకులు: సారీ బాబు చెరువులోంచి మీ బామ్మను మాత్రమే కాపాడాం.. మీ అక్కను రక్షించలేక పోయాం.. సురేష్ : మునిగిపోయింది.. మా బామ్మే.. ధ్యంక్స్ అండీ..
అనిత : చూడండి సార్ ఈ రమేషు నాకు రెండు రోజులుగా కన్ను కొడుతూ ఉన్నాడు.. అంటూ ఓ సైన్స్ టీచర్‌కు కంప్లెయింట్ ఇచ్చింది. టీచర్: ఏరా మనిషివా...లేక దెయ్యానివా.. అలా ఊరికే కన్ను కొడుతూ ఉంటే సున్నితమైన కన్ను భాగం దెబ్బతింటుందిరా... దున్నపోతు..
|