"సెల్ ఫోన్ కొన్నది దేనికి? అస్తమానూ స్విచాఫ్ చేసుకోవడానికా? లేక పాడయిందా?" కోపంగా అడిగాడు స్నేహితుణ్ణి రామానుజం
"ఏమైంది. నా ఫోన్ బాగానే పనిచేస్తుందే ?" అన్నాడు సుందర్
మరి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా 'స్విచ్డ్ ఆఫ్ ప్లీజ్ కాల్ లేటర్" అని వస్తుందే
"ఓస్.... అదా! నా ఫోన్ డైల్ టోన్ అలాగ పెట్టుకున్నాలే....!" తాపీగా చెప్పాడు సుందర్. |