బైక్ కొందామని షోరూంకు వెళ్ళాడు సీతారామయ్య.." బాగా స్పీడుగా వెళ్ళే మోడల్ చూపించు" సేల్స్‌మెన్‌తో అన్నాడతను" ఇది చూడండి సార్ పికప్ బాగుంటుంది. పెట్రోల్ ఖర్చూ తక్కువే" చెప్పాడు సేల్స్‌మెన్" ఇదేనా ఇప్పుడున్న అన్నింట్లోకి వేగవంతమైంది?"" అవును సార్ ఇక్కడ పొద్దున ఐదింటికి బండెక్కితే ఏడింటికల్లా హైదరాబాదులో ఉంటారు"" అయితే ఈ బండి నాకొద్దులే"" ఏం సార్?"" అంత ఉదయాన్నే హైదరాబాద్‌కు పోయే పని నాకేముంటుంది చెప్పు..?!" |