" ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ ఏమైనా చూస్తున్నావా వదినా?" అడిగింది సుబ్బమ్మ" అబ్బె.... ఈ సీరియల్స్‌తో విసుగెత్తి పోయింది. వాస్తవ జీవితమే ఎంతో హాయిగా వుంది" చెప్పింది సులోచన" వాస్తవ జీవితమా? ఎప్పుడు బిగినైంది? ఏ ఛానెల్లో వస్తోంది? ఎన్ని గంటలకు వస్తోంది? అడిగింది హడావుడిగా సుబ్బమ్మ |